: 'మురారి బాపు' ఆశ్రమం నుంచి సత్కారం లభించింది: ట్విట్టర్‌లో హేమమాలిని
కళారంగానికి చేసిన సేవలకుగానూ తాను మురారి బాపు ఆశ్రమం నుంచి పురస్కారం అందుకున్నట్లు అలనాటి డ్రీమ్ గర్ల్, నటి హేమమాలిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మహువా చిత్రకూట్‌లోని మురారి బాపు ఆశ్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు పేర్కొన్నారు. తాను పురస్కారం అందుకుంటుండగా క్లిక్ మనిపించిన పలు ఫోటోలను ఆమె ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పురస్కారాన్ని అందిస్తూ.. ధర్మేంద్రని, తనని సత్కరించారని కూడా ఆమె పేర్కొన్నారు.