: అందమే ఆనందం.. పెదవుల సర్జరీకి క్యూ కడుతున్న యువత
అమెరికా యువత తమ పెదవులను అందంగా మార్చుకోవడానికి సర్జరీల కోసం క్యూ కడుతున్నారట. ఎంతగా అంటే ప్రతి 19 నిమిషాలకు ఒకరు పెదాల శస్త్రచికిత్స చేయించుకునేటంతగా! ఈ విషయం అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అంతేకాదు హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ లా తమ పెదాల ఆకృతి మార్చండంటూ వైద్యులను సంప్రదిస్తోన్న మహిళలూ చాలా మంది ఉన్నారని సర్వేలో బయట పడింది. పెదాల ఆకృతి మార్చుకోవాలని యువత కోరుకోవడానికి ప్రధాన కారణం సెల్ఫీ మోజేనని పరిశోధకులు చెబుతున్నారు. సెల్ఫీలో తాము అందంగా కనిపించాలనే మోజులోనే గతేడాది 27,449 మంది పెదాల సర్జరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం సర్జరీలు చేయించుకుంటున్న వారి సంఖ్య 48శాతం ఎక్కువైందని తెలిపారు.