: నేను పిసినారి నారిని కాదు...తెలివైనదాన్ని: రకుల్ ప్రీత్ సింగ్
'సరైనోడు' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేసింది. 'సరైనోడు' సినిమా ప్రమోషన్ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, ఒక సినిమా విజయం సాధించేందుకు చాలా మంది కష్టపడతారని, 'సరైనోడు' పట్ల ప్రేక్షకుల స్పందనతో తామంతా విజయం సాధించామని చెప్పింది. తాను నిజజీవితంలో సినిమాల్లోని ఏదో ఒక పాత్రలా ఉండనని చెప్పింది. డబ్బులు ఖర్చు చేయడంలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలోని ప్రార్ధన పాత్రలా, ఎనర్జీలో 'బ్రూస్ లీ'లోని పాత్రలా, అవతలివారిని ఏడిపించడంలో 'లౌక్యం'లోని చంద్రకళలా, తెలివితేటల్లో 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని పాత్రలోలా ఉంటానని చెప్పింది. తాను తెలివైన అమ్మాయినేనని, అలా చెప్పుకునేందుకు తనకు అర్హతలు ఉన్నాయని రకుల్ ప్రీత్ తెలిపింది. డబ్బును అనవసరంగా ఖర్చు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. తాను ఖర్చు చేసిన డబ్బుకు ఓ ప్రయోజనం ఉండాలని అంది. అందుకే అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఇష్టపడతానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాగా, ఈ మధ్యే ఆమె టీవీలో ప్రసారమయ్యే 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొని, కేన్సర్ తో బాధపడుతున్న బాలిక వైద్యానికయ్యే ఖర్చు భరిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.