: అగ్రి వర్సిటీలో కొన‌సాగుతున్న‌ ఉద్రిక్తత.. మరో డిమాండ్‌ను అధికారుల ముందుంచిన విద్యార్థులు


హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తోన్న ఆందోళ‌న కొన‌సాగుతోంది. న్యూట్రిషన్ సైన్స్ కోర్సును తొలగిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిన్న‌ నిర‌స‌న తెలిపిన విద్యార్థులు.. ఈరోజు మ‌రో డిమాండ్‌ను అధికారుల ముందుంచారు. కమర్షియల్ అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల‌ను కూడా తొలగించొద్దంటూ నినాదాలు చేశారు. త‌మ డిమాండ్‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News