: అప్పట్లో యుద్ధానికి అనుకూలంగా ఓటేసి తప్పుచేశా: హిల్లరీ క్లింటన్


డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ముందున్న హిల్లరీ క్లింటన్ గ‌తంలో న్యూయార్క్ నుంచి సెనేటర్‌గా వ్యవహరించిన సంగ‌తి తెలిసిందే. 2000లో అమెరికన్ సెనేట్‌కు ఎన్నికై, ప్రభుత్వ పదవికి ఎన్నికైన మొట్ట‌మొద‌టి మహిళగా ఆమె అప్ప‌ట్లో రికార్డు సృష్టించింది. అయితే ఆ స‌మ‌యంలో ఇరాక్‌పై యుద్ధానికి అనుకూలంగా ఓటు వేసి తప్పుచేశానని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యమై ప‌శ్చాత్తాప ప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇరాక్‌పై యుద్ధానికి అనుకూలంగా ఓటు వేయ‌డం ద్వారా నాటి అమెరికా అధ్య‌క్షుడు జార్జి బుష్ గ‌వ‌ర్న‌మెంట్‌కి ఇరాక్‌పై దాడి చేసే అవకాశం ఇచ్చిన వారిలో తానూ ఉండ‌డం త‌న‌ను ప‌శ్చాత్తాపం ప‌డ‌డానికి గురిచేస్తోంద‌ని ఆమె వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News