: ఆకట్టుకుంటున్న ‘వశం’ చిత్రం ట్రైలర్


సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సినిమా నిర్మించాలనే తపన, ప్రేమ ఉన్నప్పటికీ ఆర్థికంగా అంత స్తోమత లేనప్పుడు సైలెంట్ గా ఉండటం సహజం. అయితే, అటువంటి వారిని ప్రోత్సహించే నేపథ్యంలో వచ్చిందే ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ పద్ధతి ద్వారా సినిమా ప్రియులు, ఔత్సాహికులు ఎవరైనా చిత్ర నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు. ఆవిధంగా రూపొందిన చిత్రమే ‘వశం. చల్లా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం ‘వశం’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. సినీ నటుడు వైఎస్ కృష్ణేశ్వరరావు, నందకుమార్, వాసుదేవరావు, శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జోస్యభట్ల శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

  • Loading...

More Telugu News