: ఇద్దరు నిందితులలో ఒకరు సబ్-జైలు వార్డర్


చోరీలకు పాల్పడిన నిందితులలో సిద్దిపేటకు చెందిన సబ్-జైల్ వార్డరు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఈరోజు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు నిందితులలో సిద్దిపేట సబ్ జైల్ వార్డర్ గంభీరావు వెంకటేశ్ ఉన్నారు. మరో నిందితుడు మెదక్ జిల్లా కు చెందిన బాలలింగం అని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు, ఒక కారు, ఒక మోటార్ బైక్, రూ.18 వేల నగదుతో పాటు ఒక డీవీడీ ప్లేయర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News