: కావాలని ఆ మాటలు అనలేదు: రోజా
తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. లేఖ కాపీని సుప్రీంకోర్టుకు అందజేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ఆ లేఖలో రోజా పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన వాద ప్రతివాదనల్లో తనను రెచ్చగొట్టారని, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అందువల్లే తాను బాధ, కోపంతో మాట్లాడానని తెలిపారు. కావాలని తాను ఏ ప్రజా ప్రతినిధినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు. ఇదే లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టు వెల్లడించారు.