: రోజాకు స్వల్ప ఊరట... అసెంబ్లీ కార్యాలయానికి రానివ్వాలని సుప్రీం ఆదేశం


వైకాపా శాసన సభ్యురాలు రోజాకు ఈ ఉదయం సుప్రీంకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. రోజాను అసెంబ్లీలోని వైకాపా కార్యాలయానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు తమ క్లయింట్ రోజా, స్పీకర్ ను ఉద్దేశించి క్షమాపణ లేఖ రాశారని చెబుతూ, న్యాయవాది ఇందిరా జైసింగ్ లేఖ ప్రతిని న్యాయమూర్తికి అందించారు. ఇదే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సూచించిన న్యాయస్థానం, ఈ సమస్యను మరింతగా లాగవద్దని కోరింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News