: హనుమాన్‌ జయంతి వేడుక‌: శోభ‌యాత్ర‌లో ఆందోళ‌న‌, భారీగా ట్రాఫిక్ జామ్


హనుమాన్‌ జయంతి సందర్భంగా హైద‌రాబాద్‌ నగరంలో హనుమాన్‌ శోభ యాత్ర కొన‌సాగుతోంది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ హనుమాన్‌ మందిర్‌ వరకు కొనసాగుతోన్న శోభయాత్రలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయితే, కాసేప‌టి క్రితం శోభాయాత్ర‌లో స్వల్ప వాగ్వివాదం జ‌రిగింది. కర్మన్‌ఘాట్ సమీపానికి చేరుకున్న వేడుక‌లో డీజేలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసుల‌తో హ‌నుమాన్ భ‌క్తులు విభేదించారు. ఉద్రిక్త‌త నెల‌కొనే ప‌రిస్థితుల‌ను క‌ట్ట‌డిచేసే ప్రయ‌త్నంలో పోలీసులు భ‌క్తుల‌ను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టారు. ప్ర‌స్తుతం భారీ బందోబ‌స్తు మ‌ధ్య యాత్ర కొన‌సాగుతోంది. కర్మన్‌ఘాట్ స‌మీపంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

  • Loading...

More Telugu News