: గ్యాస్ 'సబ్సిడీ'ని వదులుకున్న వారి సంఖ్య‌ కోటికి చేరింది


పేదలందరికీ సబ్సిడీ గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇచ్చిన 'గివ్ ఇట్ అప్‌' పిలుపున‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. దేశంలో 16.35 కోట్ల ఎల్పీజీ వినియోగదారుల్లో కోటి మందికిపైగా స‌బ్సిడీని వదులుకున్నార‌ని తాజాగా చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వంట చెరకుపై ఆధారపడిన నిరుపేద కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్ వెసులుబాటు క‌లిగించే ఉద్దేశంతో ఎంతో ప్ర‌తిష్మాత్మ‌కంగా గ‌త ఏడాది కేంద్ర‌ ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌య‌త్నంలో పెట్రోలియం శాఖ రూ.10 లక్షల ఆదాయ వర్గాలకు ఎల్పీజీ సబ్సిడీని కొద్ది నెల‌ల క్రితం ఎత్తివేసింది.

  • Loading...

More Telugu News