: రేపే బాబు పాదయాత్ర ముగింపు
ఏడు నెలలు.. 2817 కిలోమీటర్లు! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్థానం వివరాలవి. ఇంతటి సుదీర్ఘ యాత్ర రేపటితో ముగియనుంది. విశాఖలో ఈ సందర్బంగా శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. చారిత్రక రీతిలో పాదయాత్ర సాగించిన వైనానికి గుర్తుగా బాబు రేపు ఉదయం విశాఖలో ఓ భారీ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో పాదయాత్రగా సభావేదిక వద్దకు చేరుకుంటారు.