: బాలయ్య 99 చిత్రాల్లోని ఆసక్తికర విశేషాలు... ఆకట్టుకున్న ఎ.వి!
కథానాయకుడిగా 100వ చిత్రానికి చేరుకున్న బాలయ్యపై దర్శకుడు క్రిష్ రూపొందించిన ఏవీ, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులను ఆకట్టుకుంది. దీనిలో బాలయ్య 99 చిత్రాల్లోని ఆసక్తికర విశేషాలకు క్రిష్ పంచుకున్నాడు. ఆ వివరాలివి. * మొత్తం చేసిన సినిమాలు 99. * వీటిల్లో ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 16. * తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించినవి 12. * వంద రోజులు ఆడినవి 71 * ఒకే థియేటరులో శతదినోత్సవం జరుపుకున్నవి 44. * 175 రోజులు ఆడినవి 7. * షిఫ్ట్ పై 200 రోజులు ఆడినవి 14. * ఒకే హాల్ లో 200 రోజులు నడిచిన చిత్రాలు 5. * 300 రోజులు ఆడిన సినిమాలు 8. * ఏడాది పాటు అలరించినవి 5. * వజ్రోత్సవాలు జరుపుకున్న చిత్రాలు 2. * 99 సినిమాల్లో 110 మంది హీరోయిన్లు. * బాలయ్యతో పనిచేసిన దర్శకుల సంఖ్య 45. * బాలయ్య సినిమాలకు సంగీతాన్ని అందించిన వారి సంఖ్య 23. * రెండుసార్లు ఉత్తమ నటుడిగా పురస్కారం. * ఇప్పటివరకూ సినీ ప్రస్థానం 43 ఏళ్లు.