: వందో సినిమా కోసం ఎన్నో క‌థ‌లు విన్నా నాకు న‌చ్చలేదు!: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌


ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న‌ బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభోత్స‌వ పండ‌గ సంద‌ర్భంగా ఆ చిత్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడారు. త‌న వందో సినిమా కోసం ఎన్నో కథలు విన్నాన‌ని చెప్పారు. 'వందో సినిమాకు తగిన చిత్రంగా అవి నాకు న‌చ్చ‌లే'దని బాలకృష్ణ అన్నారు. త‌న‌కు సంతృప్తిని క‌లిగించేలా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని గౌతమీపుత్ర శాతకర్ణికు ఓకే చెప్పాన‌ని అన్నారు. క్రిష్ చెప్పిన కథ త‌న‌కు అమితంగా నచ్చిందన్నారు. నాగార్జునుడు తిరిగిన నేల అమ‌రావ‌తిలో గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర‌నిర్మాణం జ‌రగ‌నుంద‌ని అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం కలిగిందని బాలకృష్ణ అన్నారు. త‌నను అభిమానులు ఎంత‌గానో ఆద‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన‌మే త‌న‌ను ఇంత‌టి వాడిని చేసింద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News