: బాలయ్య ముందు కేసీఆర్ కోరిక... ఓకే చెప్పిన నందమూరి హీరో!
శతచిత్ర కథానాయకుడు బాలకృష్ణను తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కోరిక కోరారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రారంభోత్సవం ముగిసిన తరువాత వేదికపై మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని చెప్పిన కేసీఆర్, "బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ... ఓ కోరిక ఉంది నాకు. సినిమా పూర్తయిన తరువాత మొట్టమొదటి బ్యాచ్ లో నాక్కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటున్నా..." అనగానే, వందలాది మంది అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నవ్వుల కరతాళధ్వనుల మధ్య బాలయ్య 'ఓకే' చెప్పేశారు.