: చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఇది, క్రిష్ సరైన దర్శకుడు: మెగాస్టార్ చిరంజీవి
బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ ప్రారంభోత్సవ పండగ వైభవంగా కొనసాగుతోంది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరై మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ సినిమాకు గౌతమీపుత్ర శాతకర్ణి పేరు పెడుతూ నిర్ణయం తీసుకోవడమే మొదటి విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణ అవలీలగా చేస్తారని కొనియాడారు. చరిత్రలో అపూర్వమైన సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు అన్ని రకాలుగా న్యాయం చేస్తారని పేర్కొన్నారు. చారిత్రాత్మక సినిమాలకు క్రిష్ సరైన దర్శకుడని అన్నారు. చిత్రం గోల్డెన్ జూబ్లీ ఆడి చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.