: కేసీఆర్ క్లాప్, దాసరి దర్శకత్వం, మెగాస్టార్ స్విచ్చాన్, కెమెరా వెనుక వెంకటేష్
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ అతిరథమహారథుల మధ్య వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టగా, దాసరి నారాయణరావు ముహూర్తపు షాట్ కు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్విచ్చాన్ చేయగా, కెమెరాను విక్టరీ వెంకటేష్ ఆపరేట్ చేశారు. రాఘవేంధ్రరావు స్క్రిప్ట్ ను, సింగీతం శ్రీనివాసరావు క్లాప్ ను దర్శకుడు క్రిష్ కు అందించారు. వీటిని అందుకున్న క్రిష్ రాఘవేంధ్రరావు, సింగీతం తదితరుల కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. తొలి డైలాగును మరోసారి చదువుకున్న బాలయ్య షూటింగుకు సిద్ధమైపోయారు. అతిథులంతా చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వెల్లడించారు.