: వీడని భయం.. ఈక్వెడార్‌లో మళ్లీ కంపించిన భూమి
భూప్రకంపనల భయం ఈక్వెడార్‌ను వదలడం లేదు. ఇటీవలే 500 మందిని బలిగొన్న భారీ భూకంపాన్ని మరచిపోకముందే ఈరోజు మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై 6.0 తీవ్రత నమోదైంది. ఈ రోజు మళ్లీ భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.