: అమ్మాయికి 24, అబ్బాయికి 17... పెళ్లిని అడ్డుకున్న పోలీసులు!
ఆ యువతికి 24 ఏళ్లు. తనకన్నా ఏడేళ్లు చిన్నవాడైన 17 సంవత్సరాల బాలుడితో పెద్దలు వివాహం నిశ్చయించారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో జరిగింది. వీరిద్దరి వివాహానికీ ఒప్పుకున్న పెద్దలు, వేడుకను వైభవంగా జరిపించేందుకు నిర్ణయించారు. కల్యాణ మండపానికి చేరుకుని పెళ్లి పనుల్లో నిమగ్నమైన వేళ, విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు వివాహ వేదిక వద్దకు వచ్చి, వధూవరుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువకుడు ఇంకా మేజర్ కాదని, అతనికి పెళ్లి వయసు రాలేదని నచ్చజెప్పారు. అబ్బాయికి 20 సంవత్సరాలు దాటేంతవరకూ పెళ్లి చేయబోమని హామీపత్రం రాయించుకుని వెళ్లారు.