: ఇది సమంత 'జిమ్' ప్రేమ కథ!
సమంత ప్రేమలో పడింది. దీనిపై ఈ ముద్దుగుమ్మ చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చింది. గతంలో సినీ నటుడు సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సమంత తరువాత ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టినట్టేనని చెప్పింది. అయితే తాజాగా తన ప్రేమ కథ గురించి సమంత ట్వీట్ చేసింది. సమంత ప్రేమ కథ మొదలైంది జిమ్ లో. ఎవరితో అనే అనుమానం వచ్చిందా? వర్కవుట్లతో సమంత ప్రేమలో పడింది. రకుల్ ప్రీత్, పరిణీతి చోప్రా తదితరుల తరహాలో సమంత జిమ్ లో వర్కవుట్లతో ప్రేమలో పడింది. ప్రతి రోజూ కొంత సేపైనా జిమ్ లో గడుపుతున్నానని పేర్కొంది. అందుకు సాక్ష్యంగా కండలు ప్రదర్శిస్తూ జిమ్ లో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.