: నష్టపోయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉంటానన్న పవన్ కల్యాణ్ !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కలెక్షన్ల విషయంలో అంచనాలను తల్లకిందులు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ని డిస్ట్రిబ్యూటర్లు కలిసినట్లు తెలిసింది. కలెక్షన్లు రాకపోవడంతో తాము బాగా దెబ్బతిన్నామని పవన్ ముందు వారు వాపోయినట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్, వారికి అండగా ఉంటానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం ద్వారా ఈ నష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటానని వారికి పవన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.