: జేమ్స్ బాండ్ చిత్రాల దర్శకుడు హామిల్టన్ మృతి
జేమ్స్ బాండ్ చిత్రాల దర్శకుడు గయ్ హా మిల్టన్(94) కన్నుమూశారు. స్పెయిన్ లోని మలోర్కలో ఆయన మృతి చెందారు. హా మిల్టన్ మృతిపై హాలీవుడ్ తో పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్యారిస్ లో 1922లో ఆయన జన్మించారు. ఫ్రెంచ్ స్డూడియోలో ఆయన బాయ్ గా పనిచేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలైన ‘గోల్డ్ ఫింగర్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, లైవ్ అండ్ లెట్ డై’, ‘ద మ్యాన్ విత్ ద గోల్డెన్ గన్’ కు హామిల్టన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలే కాకుండా ‘ఫ్యునెరల్ ఇన్ బెర్లిన్’, ‘ది బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్’ వంటి చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.