: రాణించిన సన్ రైజర్స్...గుజరాత్ 74/3


సన్ రైజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. ఐపీఎల్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ జట్టుకు ఆదిలోనే భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న ఆరోన్ ఫించ్ (0)ను ఆదిలోనే అవుట్ చేశాడు. అనంతరం రైనా (46), మెక్ కల్లమ్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. రైనా దూకుడుగా ఆడగా, మెక్ కల్లమ్ (18) జోరు పెంచే క్రమంలో బిపుల్ శర్మ బౌలింగ్ లో కట్ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన దినేష్ కార్తిక్ (8) ఒక ఫోర్ తో దూకుడు చూపినా హుడా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ జట్టు 74 పరుగులు చేసింది. రైనాకు జతగా బ్రావో దిగాడు.

  • Loading...

More Telugu News