: కరవుకి, ఐపీఎల్ కి సంబంధం ఏంటి?: యువరాజ్ సింగ్
మహారాష్ట్రలో ఏర్పడ్డ కరవుకి, ఐపీఎల్ నిర్వహణకు సంబంధం ఏంటో తనకు తెలియడం లేదని ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్ కు దూరంగా ఉన్న యువరాజ్ సింగ్ ముంబైలో మాట్లాడుతూ, నీటి కరవు కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కరవుకి ఐపీఎల్ కి సంబంధం ఏంటని యువీ అడిగాడు. ఒక రాష్ట్రంలో కరవు పరిస్థితి ఏర్పడితే దానికి ఐపీఎల్ చేసేది, చేయగలిగింది ఏముందని యువరాజ్ ప్రశ్నించాడు. మహారాష్ట్రలో ఏర్పడ్డ దుర్భిక్షానికి, క్రీడకు ముడిపెట్టడం సరికాదని యువీ అభిప్రాయపడ్డాడు. ఆటను ఆటగా చూడాలి కానీ ఇతర సంబంధాలు అంటగట్టడం సరికాదని సూచించాడు. ఒక క్రికెటర్ గా తాను ఇంతకు మించి మాట్లాడలేనని స్పష్టం చేశాడు. క్రికెటర్ గా ఎక్కడ టోర్నీ నిర్వహించినా వెళ్లి ఆడడమే తన కర్తవ్యం అని తెలిపాడు.