: మారణాయుధాలతో భయపెట్టి 100 మంది రైలు ప్రయాణికులను దోచుకున్నారు!
కదులుతున్న రైలులో 100 మంది ప్రయాణికులను దుండగులు ఆయుధాలతో భయపెట్టి దోచుకుని కలకలం రేపారు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు సుల్తాన్ పూర్ నుంచి అహ్మదాబాద్ కు వెళ్తుండగా, లక్నోకు సరిగ్గా 290 కిలోమీటర్ల దూరంలో ఉండగా, 12 మంది సాయుధులైన దుండగులు రైలులోకి ప్రవేశించారు. అనంతరం ఒక బోగీలో ప్రవేశించి అందులో ఉన్న వంద మందికి ఆయుధాలు చూపించి వారి దగ్గర ఉన్న నగదు, నగానట్రా దోచుకున్నారు. వస్తువులు ఇచ్చేందుకు నిరాకరించిన పలువురిపై దుండగులు చేయిచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల నుంచి దోపిడీ పూర్తి కాగానే వారు అక్కడి నుంచి పరారయ్యారని బాధితులు చెప్పారు.