: ఎడారిలో స్విమ్మింగ్ పూల్...స్నానం చేయాలంటే మాత్రం ఒకే ఒక్క షరతు!
ఎడారిలో చల్లటి నీటితో స్విమ్మింగ్ పూల్ కనిపిస్తే ఎలా ఉంటుంది? వెంటనే దిగి స్నానం చెయ్యాలనిపిస్తుంది కదూ? అయితే ఆ స్విమ్మింగ్ పూల్ కు సంబంధించి ఉన్న ఒకే ఒక్క షరతుతో స్నానం చేయడం చాలా కష్టమని పలువురు పేర్కొంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలోని మొజావే ఎడారిలో 2014లో ఆల్ ఫ్రెడో బర్సుగ్లియా అనే ఆస్ట్రియన్ ఆర్టిస్ట్ 11 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో చల్లని నీటితో శుభ్రమైన స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. ఇందులో ఎవరైనా స్నానం చేయవచ్చు. అయితే దీనిలో స్నానం చేయాలంటే మాత్రం దీనికి సంబంధించిన తాళాన్ని వెస్ట్ హాలీవుడ్ లోని మ్యాక్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలి. అక్కడ తాళం చెవితో పాటు జీపీఎస్ పరికరాన్ని కూడా వాళ్లు ఇస్తారు. దానిని చూసుకుంటూ ఈ స్విమ్మింగ్ పూల్ చేరుకుని జలకాలాడవచ్చు. అయితే కేవలం 24 గంటల్లో దీనిని గుర్తించి స్నానం చేయాలని వారు సూచించారు.