: కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించిన చైనా అధ్యక్షుడు
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారు. ది మిలటరీ జాయింట్ ఆపరేషన్ కమాండ్ కు చీఫ్ గా ఆయన నియమితులయ్యారు. దీంతో ఆయన నేరుగా సైన్యాన్ని ఆదేశించే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు దేశాధ్యక్షుడిగా, చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు ఏకంగా సైన్యానికి ఆదేశాలు జారీ చేయగల అధికారిగా పదవీ భాధ్యతలు స్వీకరించడం విశేషం. దక్షిణ చైనా సముద్రం మీద చైనా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఆయన ఈ పదవీ భాధ్యతలు స్వీకరించడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.