: వచ్చే నెల నాటికి జగన్ ప్రతిపక్ష స్థానం కోల్పోతారు: మంత్రి పుల్లారావు జోస్యం
వచ్చే నెల నాటికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోతారని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని భూ కుంభకోణం ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధారాలు చూపిస్తే ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనంటూ మంత్రి సవాల్ విసిరారు. మే 30న రాజధాని ప్రాంతంలోని నేలపాడులో రైతులకు ఫ్లాట్లు పంపిణీ చేస్తామని పుల్లారావు పేర్కొన్నారు.