: దశాబ్దం తరువాత అప్పుకోసం ప్రయత్నాలు ప్రారంభించిన సౌదీ అరేబియా
చమురు నిల్వలతో అంత్యంత సంపన్నదేశంగా నిన్న మొన్నటి వరకు నీరాజనాలు అందుకున్న సౌదీ అరేబియా అప్పుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. చమురు ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనం కావడానికి తోడు, కరెన్సీలో హెచ్చుతగ్గులు ఆ దేశాన్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేశాయి. దీంతో అమెరికా నుంచి సౌదీ భారీ మొత్తంలో అప్పుతీసుకునేందుకు సిద్ధమవుతోంది. సుమారు 6 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకోవాలని భావిస్తోంది. సుమారు దశాబ్దం తరువాత సౌదీ అప్పుకోసం ప్రయత్నించడం విశేషం. సౌదీ అరేబియా బడ్జెట్ లోటు వంద బిలియిన్ డాలర్లని తేలింది. దీనిని పూడ్చేందుకు విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయం, బాండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ ఇంకొన్ని సమస్యలు ఎదురు కావడంతో అప్పుతీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.