: ఆస్తుల వివరాలు అడిగే హక్కు బ్యాంకులకు లేదు.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాల్యా
బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి దేశం వీడాడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా సుప్రీంకోర్టులో ఈరోజు అఫిడవిట్ దాఖలు చేశారు. బ్యాంకులకు తన ఆస్తుల గురించి ప్రశ్నించే హక్కు లేదని అందులో పేర్కొన్నారు. విజయ్ మాల్యా పాస్‌పోర్టును ఇటీవలే విదేశాంగ శాఖ సస్పెన్షన్ లో పెట్టింది. అనంతరం విజయ్ మాల్యాపై పిఎంఎల్‌ఏ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తానని ఓసారి, కొంత సమయం కావాలని మరోసారి, కొంత చెల్లిస్తానని ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తూ ఇన్నాళ్లు కాలయాపన చేసిన ఆయన.. ఇప్పుడు బ్యాంకులకు తన ఆస్తుల గురించి ప్రశ్నించే హక్కు లేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.