: కాలిఫోర్నియా గవర్నర్ నుంచి సీఎం కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం లభించింది. కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ నుంచి ఆయనకు ఈరోజు ప్రత్యేక ఆహ్వానం అందింది. శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చే జూన్ లో జరగనున్న ‘సబ్ కాంటినెంటల్ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్’ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఈ ఆహ్వానంలో కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సోలార్ ఎనర్జీ ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కాలిఫోర్నియా, తెలంగాణ రాష్ట్రాలు వర్షాభావం, పచ్చదనం వంటి అంశాల్లో ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని కూడా ఈ ఆహ్వాన పత్రంలో ప్రస్తావించారు. కాగా, ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని మంత్రి కేటీఆర్ కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా నిశా బిశ్వాల్ అందజేశారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిశా బిశ్వాల్ కు ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు.