: పెళ్లికొడుకులు నల్లగా ఉన్నారని పీటలపైనే పెళ్లిళ్లు ఆపేసిన అక్కాచెల్లెళ్లు!


పెళ్లి కొడుకులు నల్లగా ఉండటంతో వారిని వివాహం చేసుకునేందుకు అక్కాచెల్లెళ్లు తిరస్కరించడంతో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఈ సంఘటన ఆగ్రాలో నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఫతేహాబాద్ లోని సికారా గ్రామంలోని అక్కాచెల్లెళ్లకు వివాహం నిమిత్తం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. అయితే, పెళ్లి కొడుకులు నల్లగా ఉన్నారనే కారణంగా వారిని చేసుకోమంటూ పెళ్లి కూతుళ్లు చివరి నిమిషంలో తేల్చి చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఉన్నపళంగా ఈవిధంగా అంటున్నారేమిటంటూ వారిని ప్రశ్నించారు. ఈ విషయమై ఇరు కుటుంబాల వారు, పెద్దలు.. అక్కాచెల్లెళ్లకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారు ససేమిరా అన్నారు. తమకు చూపించిన ఫొటోల్లో వారు మంచి శరీర ఛాయతో, వయస్సు తక్కువగా ఉన్నట్లు ఉన్నారని... తీరా పెళ్లిలో చూస్తే, నల్లగా, వయస్సు పైబడిన వారిలా కనపడుతున్నారని ఆ అక్కాచెల్లెళ్లు చెప్పడంతో వారి వివాహాలు ఆగిపోయినట్లు ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి వినాయక్ ప్రకాష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News