: నిరాశ పరుస్తున్న అమెరికా వైఖరి: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్
యుద్ధం చేయడమనేది కాలం చెల్లిన భావన అనే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికీ విశ్వసించకపోవడం తనను నిరాశకు గురి చేస్తోందని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాలలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పై ఆయన స్మారకోపన్యాసం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గాంధీ మహాత్ముడు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి వారిని తయారుచేయాల్సిన సమయం ఇదేనని అన్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్లే ఏదో విధంగా అధికారం దక్కించుకోవాలని చూస్తారని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తొలి నల్ల జాతీయుడు బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ నల్లజాతీయుడైన ఓ గవర్నర్ కంట కన్నీరును చూసిన తన కళ్లు కూడా చమర్చాయన్న విషయాన్ని కమల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.