: గులాబీ కండువా కప్పుకున్న టీడీపీ మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర సమితి గూటిలో తెలుగు దేశం పార్టీ నాయకుడు మరొకరు చేరారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేత పి.రాములు ఈరోజు హైదరాబాద్‌లో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2002 నుంచి 2004 వరకు ఆయన క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత శాసనసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి గువ్వల బాలరాజు చేతిలో ఓడారు.