: బాడీ బిల్డర్లూ... బహుపరాక్!
సెలబ్రిటీ ఈవెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఉద్యోగావకాశాలు ఈ రంగంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బాడీ బిల్డింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతి వీధిలో ఒక జిమ్ దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నలుగురు బాడీబిల్డర్లు వరుసగా మృత్యువాతపడడం పలువురిని ఆందోళనలోకి నెట్టింది. భోజనం చేస్తుండగా ఆహార నాళం చిట్లి దక్షిణాసియా బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ కాంస్యపతక గ్రహీత హుమయూన్ ఖుర్రం మృతిచెందగా, మరో బాడీ బిల్డర్ హమీద్ అలి మృతి మిస్టరీగానే ఉంది. బాడీ బిల్డర్లు తక్కువ వ్యవధిలో ఎక్కువ ఫిట్ నెస్ వచ్చేందుకు ఉత్ప్రేరకాలను తీసుకుంటారు. వీటి వినియోగం మోతాదుకు మించితే పెను ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ క్రమంలో బాడీ బిల్డర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి.