: మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మధ్యప్రదేశ్ హోం మినిస్టర్.. వీడియోలో బయటపడిన నీచప్రవర్తన
మధ్య ప్రదేశ్‌లో సీనియర్ నాయకుడు, హోం మంత్రి బాబూలాల్ గౌర్ ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఓ బస్సులో పలువురు ఎక్కుతున్న సమయంలో ఒక మహిళను ఉద్దేశ పూర్వకంగా చేతులతో తాకారు. చుట్టూ కార్యకర్తలు ఉండడంతో ఎవరికీ కనిపించబోదనే ఉద్దేశంతో ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమెను టచ్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో సదరు మంత్రిగారి ఈ నీచ ప్రవర్తన రికార్డయింది.