: కేకులే...కానీ చూడగానే భయంతో కేక పెడతాం!


సాధారణంగా కేకులు చూడగానే నోరూరుతుంది. కానీ ఓ మహిళ తయారు చేసే కేకులు మాత్రం భయపెడుతుంటాయి. శాడిస్టులు మాత్రమే ఆ కేకులు తినేందుకు అనువుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్న 30 ఏళ్ల మహిళ బయట ఓ బేకరీని కూడా నిర్వహిస్తోంది. ఆమె వినూత్నంగా కేకులను తయారు చేయడంలో దిట్ట. అయితే రోజూ ఆసుపత్రిలో చూసే పరిస్థితులతో ఆమె కేకులు తయారు చేస్తుంది. ఈ కేకులు చూస్తే ఎవరైనా బెదిరిపోవాల్సింది. అవి కేకులని తెలిశాక...రుచి చూడాల్సిందే. మానవ శరీరంలోని మెదడు, గుండె, చిన్నపిల్లల ముఖం, పసి బిడ్డ... ఇలా కాదేదీ కేకుకనర్హం అన్నట్టు తయారు చేసి విక్రయిస్తుంటుంది.

  • Loading...

More Telugu News