: ప్రధాని ప్రకటించిన ఒక్క అవార్డునూ పొందలేకపోయిన మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు
జాతి ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాల అమలు తీరును పరిశీలించిన తరువాత నరేంద్ర మోదీ, అవార్డులను ప్రకటించగా, మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కదానికీ స్థానం లభించలేదు. ప్రభుత్వం అందిస్తున్న నాలుగు ప్రదాన సంక్షేమ పథకాల్లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు అవార్డులు రాలేదు. జన్ ధన్ యోజన్, స్వచ్ఛ భారత్ (గ్రామాలు) సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ తదితరాల్లో అవార్డులను ప్రకటించగా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు గుర్తింపు లభించలేదు. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీములో గుజరాత్ కు చెందిన ఐదు జిల్లాలు తుది 17 ఉత్తమ జిల్లాల్లో నిలిచినప్పటికీ, అవార్డును పొందలేకపోయాయి. కాగా, ఈ అవార్డులకు సంబంధించి దేశవ్యాప్తంగా 74 జిల్లాలను నామినేట్ చేసి, 10 అవార్డులను ప్రకటించారు. మోదీ మనసులో నుంచి పుట్టిన స్కీములు, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు, ఆయన సొంత రాష్ట్రంలోనూ ఉత్తమంగా అమలు కాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.