: జయలలిత ఎన్నికల ప్రచారంలో విషాదం.. ఇద్దరి మృతి
తమిళనాడు ముఖ్యమంత్రి నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచార సభలో విషాదం చోటుచేసుకుంది. సేలంలో అమె నిర్వహిస్తోన్న బహిరంగా సభకు వచ్చిన అన్నాడీఎంకే కార్యకర్త వడదెబ్బతో మృతి చెందాడు. మండే ఎండల్లో బహిరంగ సభలో పాల్గొన్న కార్యకర్త వడదెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్యకర్తలు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మరో వైపు బహిరంగా సభలో తొక్కిసలాట చోటు చేసుకొని మరో కార్యకర్త మరణించాడు.