: అలా పనిచేయకండి.. ఇలా చేయండి!: అధికారులకు సూచించిన మోదీ
అధికారులు తమ పనుల్లో ఏ మాత్రం అలసత్వాన్ని కనబర్చొద్దని, సమాజ సంక్షేమానికి పాటుపడే ప్రతినిధుల్లా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ ప్రగతికి అధికారులు ప్రజలతో మమేకమై కృషి చేయాలని చెప్పారు. టీమ్‌గా ఏర్పడి పనిచేస్తే మంచి ఫలితాలు రాబొట్టొచ్చని పేర్కొన్నారు. పాలనలో ప్రయోగాలు చేస్తూ విభిన్నంగా పనిచేసే వారిని తాను ఎప్పుడూ అభినందిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఒకే దగ్గర కూర్చోవడం, పనిలో అలసత్వం ప్రదర్శించడం చేస్తే సమాజంలో మార్పులు తేలేమని మోదీ అభిప్రాయపడ్డారు. రిస్క్ తీసుకోలేనిదే ప్రయోగం చేయలేమన్నారు. పౌర సేవల వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.