: మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ... ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన రద్దు


కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు షాక్... ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. రాష్ట్రపతి పాలన విధించడం నియమానుసారంగా జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆపై హరీశ్ రావత్ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో అన్యాయంగా రాష్ట్రపతి పాలన విధించారని ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిన్న ఇదే కేసు విచారణలో భాగంగా, రాష్ట్రపతి కూడా ఒక్కోసారి తప్పు చేయవచ్చు అని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం పంతానికి పోయినట్టుగా ప్రవర్తించి, ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. తాజా హైకోర్టు నిర్ణయం ఆ పార్టీకి ఎదురుదెబ్బే!

  • Loading...

More Telugu News