: తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న ద్రవిడ్ కుమారుడు
టీమిండియాలో ద్రవిడ్ ను మించిన టెక్నికల్ ఆటగాడు మరొకరు లేడనడంలో అతిశయోక్తి లేదు. సహచరులంతా జామీ అని ముద్దుగా పిలుచుకునే ద్రవిడ్ రిటైర్మెంట్ తరువాత అండర్ 19, ఇండియా 'ఏ' జట్టుకు కోచ్ గా మారి, వీలుచిక్కినప్పుడల్లా కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారుల్లో ఎవరైనా తనలా మంచి క్రికెటర్ గా మారితే బాగుంటుందని పలు సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ, వారేం కావాలనుకుంటే ఆ రంగంలోనే వారిని ప్రోత్సహిస్తానని కూడా స్పష్టం చేశాడు. అయితే అతని కుమారుడు సుమిత్ (10) అండర్-14 టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో 12 బౌండరీల సాయంతో 125 పరుగులు చేశాడు. సహచరుడు ప్రత్యూష్ 143తో రాణించడంతో ఫ్రాంక్ ఆంటోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్(బీయూసీసీ) 246 పరుగుల తేడాతో విజయం సాధించింది.