: సికింద్రాబాద్‌లో యూకో బ్యాంకు సిబ్బందిని ఆందోళనకు గురిచేసిన సైకో
బ్యాంకు సిబ్బందిని ఓ సైకో తీవ్ర ఆందోళనకు గురిచేశాడు. రాళ్లు, రాడ్లను చేతిలో పట్టుకొని బ్యాంకు సిబ్బందిపై దాడి చేశాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని యూకో బ్యాంకులో జరిగింది. కొద్ది సేపటి క్రితం బ్యాంక్లోకి రాళ్లు, రాడ్తో ప్రవేశించిన సైకో పనిచేసుకుంటోన్న బ్యాంకు సిబ్బందిపై దాడికి దిగాడు. ఆరుగురు సిబ్బందిని గాయపర్చాడు. అనంతరం తేరుకున్న బ్యాంకు సిబ్బందంతా కలిసి అతన్ని పట్టుకొని చావబాదారు. తాడుతో సైకోను బంధించి పోలీసులకు అప్పగించారు. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సైకోగా మారిన సదరు వ్యక్తి పేరు సురేష్ అని సమాచారం.