: కల్తీ మద్యంపై చంద్రబాబు సర్కారు క్విక్ రియాక్షన్!... ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం
గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడులో కల్తీ మద్యం ఘటనలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనపై చంద్రబాబు సర్కారు వేగంగా స్పందించింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయినా అమరావతి మండలంలో బెల్టు షాపులే లేవని ఆయన చెప్పారు. ఏదైమైనా ఈ ఘటన వెనుక ఉన్న వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ ఘటనపై స్పందించారు. విచారణలో దోషులుగా తేలేవారిని ఉపేక్షించబోయని ఆయన గుంటూరులో ప్రకటించారు.