: 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుల ప్రదానంపై ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేసిన గౌతమ్ గంభీర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల ప్రదానంపై ఆసక్తికర అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ జట్టులోని 11 మంది సభ్యులందరి సహకారంతో మ్యాచ్ గెలిస్తే.. మెరుగైన ఆటతీరు కనబర్చిన జట్టులోకి ఒక్కరికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ప్రదానం చేయడమేంటని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. టీమ్‌ని గెలిపించిన ఘనత కేవలం ఒక్కరికే దక్కేలా చేయడం సరికాదన్నాడు. అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ప్రదానం చేయకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌ని గురించి ప్రస్తావిస్తూ ఆ మ్యాచ్‌లో తనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించిందని, కానీ తమ బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్స్‌పై విజృంభించకపోతే తమ జట్టు గెలుపునందుకోకపోయేదని పేర్కొన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ప్రదానం చేయకపోతేనే బాగుంటుందని అన్నాడు.