: వాట్సాప్‌ను మించిన యాప్ కనుగొనే ప్రయత్నం విఫలం కావడంతోనే టెక్కీ ఆత్మహత్య: పోలీసులు
హైదరాబాదులో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ లక్కీ అగర్వాల్(35) వాట్సాప్‌ను మించిన యాప్ కనుగొనే ప్రయత్నం విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. విద్యాధికుడైన లక్కీ ఇంటర్ నెట్‌లో నొప్పి లేకుండా చనిపోయే పద్ధతిని సెర్చ్ చేసి, 5 వేల రూపాయలతో నైట్రోజన్ గ్యాస్ ను కొనుగోలు చేసి, అనంతరం రూంలో ఆ గ్యాస్ లీక్ చేసి సూసైడ్ కు చేసుకున్నాడు. లక్కీ అగర్వాల్ అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు వివరిస్తూ.. కొత్త యాప్‌ను తయారు చేసే క్రమంలో సక్సెస్ కాలేకపోగా, ఆర్థికంగా నష్టాలు రావడంతో లక్కీ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. లక్కీ సూసైడ్ లెటర్ ఆధారంగా ఈ విషయాలు తెలిశాయని పోలీసులు చెప్పారు.