: బలంగా కనిపిస్తేనే ఆకర్షణీయం... ఒలింపిక్స్ టెన్నిస్ పతకం డౌటే: సానియా మీర్జా


ఆకర్షణీయంగా కనిపించడమంటే, శరీరపు రంగు బాగుండటం కాదని, ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే ఎదుటివారిని ఆకర్షించవచ్చని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మరికొన్ని రోజుల్లో ఆమె పుస్తకం విడుదల కానున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జీవిత చరిత్రను తెరకెక్కించాలని జరుగుతున్న ప్రయత్నాలపై తానేమీ మాట్లాడబోనని, ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే, మరికొన్నేళ్లు వేచి చూడాలని చెప్పింది. ఇటీవలి పరాజయాలను ప్రస్తావిస్తూ, పరాజయాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయని, గత వారంలో జకోవిచ్ సైతం ఓడిపోయాడని గుర్తు చేసింది. ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ సీజన్ లో మార్టినాతో కలిసి తిరిగి ఫామ్ లోకి వస్తానన్న నమ్మకం ఉందని పేర్కొంది. రియో ఒలింపిక్స్ లో మిక్సెడ్ డబుల్స్ లో పతకం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతూ, సరైన భాగస్వామి లేకపోవడమే కారణమని వెల్లడించింది. మహేష్ భూపతి ఫాంలో లేకపోవడం, లియాండర్ పేస్, లేదా రోహన్ బొప్పనలు అంతర్జాతీయ స్థాయిలో గట్టి టీములు ఎదురయ్యే ఒలింపిక్స్ లో పోటీ పడలేరని సానియా తెలిపింది. సింగిల్స్, డబుల్స్ లో పతకం వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించడం లేదని, అయితే, బలమైన జట్టును పంపితే, పతకం కోసం గట్టిగా ప్రయత్నించవచ్చని తెలియజేసింది.

  • Loading...

More Telugu News