: 2016 రియో ఒలింపిక్స్: నేడు వెలగనున్న ఒలింపిక్ జ్యోతి
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న 2016 ఒలింపిక్స్‌కు అన్ని ఏర్పాటు పూర్తవుతున్నాయి. 2016 రియో ఒలింపిక్స్ జ్యోతిని పశ్చిమ గ్రీస్‌లోని పురాతన ఒలింపియాలో నేడు వెలిగించనున్నారు. గ్రీస్ సంప్రదాయం ప్రకారం ఒలింపిక్ జ్యోతిని వెలుగించే కార్యక్రమాన్ని ఈరోజు వేడుకగా నిర్వహించనున్నారు. ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన అనంతరం, జ్యోతితో గ్రీస్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం ఈనెల 27వ తేదీన జ్యోతిని బ్రెజిల్స్ రియో ఒలింపిక్స్ నిర్వాహకులకు అందచేస్తారు. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న 2016 రియో ఒలింపిక్స్.. ఆగస్టు 21వరకు కొనసాగుతాయి.