: గుండెజబ్బుతో నిమ్స్ లో చేరిన పిల్లి సుభాష్... పరామర్శించిన వైఎస్ జగన్
వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గుండె సంబంధిత వ్యాధితో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో మూడు రోజుల క్రితం ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బోస్ కు వైద్య పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు... ఆయన గుండె నుంచి రక్తాన్ని సరఫరా చేసే రెండు కవాటాలు మూసుకుపోయినట్లు నిర్ధారించారు. వాటిని సరిదిద్దే క్రమంలో రెండు స్టెంట్లను కూడా అమర్చారు. ఈ క్రమంలో నిన్న నిమ్స్ కు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పిల్లి సుభాష్ ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం కాస్తంత కుదుటపడిన పిల్లి సుభాష్... ఆసుపత్రిలోని మిలీనియం బ్లాకులో కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.