: కుప్వారాలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య భీకర పోరాటం
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కొన్ని గంటలుగా సాగుతోన్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను అందమొందించాయి. ఉగ్రవాదుల ప్రవేశాన్ని తిప్పికొడుతూ, వారిపై భద్రతా బలగాలు పోరాడుతున్నాయి.